Harish Rao: అల్లు అర్జున్‌ను రేవంత్ పర్సనల్ టార్గెట్ చేస్తున్నాడు..! 12 d ago
అల్లు అర్జున్‌ను రేవంత్ రెడ్డి పర్సనల్ టార్గెట్ చేస్తున్నాడని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రేవంత్ రెడ్డి అన్న టార్చర్ వల్ల ఒక రైతు సూసైడ్ చేసుకుంటే, ఇప్పటి వరకు దానిపై కనీసం కేసు నమోదు కాలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో 50 మంది గురుకుల విద్యార్థులు చనిపోతే, రేవంత్ రెడ్డి కనీసం దాని మీద మాట్లాడలేదని విమర్శించారు. 500 మంది రైతులు, 80 మంది ఆటో డ్రైవర్లు చనిపోతే రేవంత్ రెడ్డికి మాట్లాడటానికి సమయం లేదు కానీ ఫిల్మ్ ఇండస్ట్రీని టార్గెట్ చేయడానికి మాత్రం సమయం ఉందని హరీష్ రావు ఏద్దేవా చేశారు.